ఈ అన్నయ్య అందరి లాంటి వాడు కాదు

  • 21.2k
  • 4.8k

"కాయ్ ఝాలా" అన్న అమిత మాటలకు అమూల్య ఈ లోకం లోకి వచ్చింది. "ఏం లేదు" అని కాఫీ కలుపుతూ ఉంది. "టెన్ మినిట్స్ నుండి కాఫీ కలుపుతూనే ఉన్నావు. ఇట్స్ గెట్టింగ్ కోల్డ్" అన్నాడు అమిత్ వచ్చి రాని తెలుగులో. "ఓహ్ సారీ మీకు కాఫీ వేడి గా ఉంటే ఇష్టం కదా, మళ్ళీ వేడి చేసి తెస్తా. ఒక్క నిమిషం" అని గ్యాస్ వెలిగించింది అమూల్య. కాఫీ అమిత్ కి ఇచ్చాక అమిత్ అన్నాడు "టుడే ఇస్ రాఖీ, మీ అన్నయ్య ఆనంద్ వస్తున్నాడా?" "ఐ డోంట్ నో, తెలీదు చూద్దాం" అంది అమూల్య నిర్లిప్తంగా. అమూల్య బెడ్రూం లోకి మంచం మీద పడుకొని ఆలోచిస్తోంది.... అన్నయ్య ఎలా ఉన్నాడో ఏమో. పెళ్లి అయ్యి మూడు నెలలు అయ్యింది. నేను ఇక్కడ పూణే లో, పుట్టిల్లు హైదరాబాద్ లో. అదే తెలుగు వాడిని పెళ్లి చేసుకుంటే ఆషాఢం అనో