క్షంతవ్యులు - 10

  • 11.9k
  • 2.4k

క్షంతవ్యులు – Part 10 చాప్టర్ 25 ఆ మధ్యాహ్నం మేము చేరేటప్పటికి సరళ ఒక్కతె ఉంది ఇంటిలో. "రా యశో, రామంబాబుని ఆహ్వానిస్తే ఆయన నాకు బోనస్ తీసుగొచ్చేరు," అంది సరళ. "రాజేంద్ర క్లినిక్ లో వున్నారా?" అన్నాను. "మీతో వచ్చిన తంటానే ఇది, కాని వాళ్లకు కంచాలు అయిన వాళ్ళకి విస్తర్లు," అంది సరళ నవ్వుతూ. "ఆయనకైతే పస్తులన్నవిషయం చెప్పటం మర్చిపోయావు సరళా," అంది యశో నవ్వుతూ. "నాకుకోపం తెపిద్దామనుకుంటే మీది వృధాప్రయాస, రోజులుమారాయి," అన్నాను. అప్పుడే దిల్ బహాదూర్ మంచినీళ్ళు తెచ్చేడు, మమల్నిగుర్తుపట్టి నమస్కరించేడు. "దిల్ బహాదూర్, డాక్టర్ గారికి బంధువు లొచ్చేరని చెప్పు," అంది సరళ. ఆ రాత్రి నేనూ రాజేంద్రా మేడమీద కూర్చుని వున్నాము. సరళా, యశో కింద వున్నారు. ‘‘అయితే రామంబాబూ. మీరిక్కడే వుండిపోకూడదా? అక్కడికీ, ఇక్కడికీ ఎందుకు వెళ్లటం? మాది లంకంత ఇల్లు. ఏం చేసుకుంటాము చెప్పండి. మేమిద్దరమూ, మా మామగారు కూడా ఇక్కడకు రావటం మానేశారు,’’ అన్నాడు రాజేంద్ర. మేము ఉదయం వాళింట్లో అడుగుపెట్టినప్పట్నుంచి ఇదే ధోరణి. యశోని సరళ,