శశివదనే - రెండవ భాగం - 2

  • 18.2k
  • 8.3k

దేవదాసి గురించి కొంత విని ఉన్నాడు. ఆలయానికి కావలసిన ధర్మ కార్యాలు చేయటానికి, ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించటానికి, స్వామి ని నాట్య గానాలతో అలరించటానికి ఆమె చిన్నతనం లోనే దేవాలయానికి అంకితం అవుతుంది. శివుడు పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. “ఇంత చిన్న వయసులో అంత భక్తి భావంతో భగవంతుని సేవకు అంకితం అయిపోవటం సాధ్యమేనా? దానికి ఎంత నిస్వార్థత, నిబద్ధత ఉండాలి” అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి ఆమె పై గౌరవ భావం కలిగింది. ఆ తరువాత రోజు కూడా గిరిజ ఉదయాన్నే గుడికి వచ్చి అన్ని పూజా కార్యక్రమాలలో పాలు పంచుకుంది. సంగీత నృత్యాలతో భగవంతుని ఆరాధించినది. ఆ రోజు మద్యాహ్నం దేవుడికి నివేదన అయిపోయాక పూజారి గారు శివుడిని పిలిచి – “అబ్బాయి శివుడూ, ఈ ఊరికి క్రొత్తగా వచ్చావు కదా ఈ చుట్టు పక్కల ప్రదేశాల విశిష్టత తెలుసునా?” అని