అప్రాశ్యులు - 7

  • 11.2k
  • 3k

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 7 ఒక పదిహేను రోజులు గడిచిపోయినాయి. ఈ రోజు సాయంకాలం రామం రజని యింటికి బయయి దేరి వెళ్ళాడు. రజని యింటికి తాళం వేసి వుంది. ఎంతో సేపు ఎదురు చూసాడు. విసిగి విసిగి కాళ్ళుపీకి అక్కడే కూలబడిపోయాడు. చీకటి పడి చాలాసేపయింది. రజని జాడ లేదు. చివరకు ఒక విధమైన మగత నిద్రలో పడ్డాడు, హఠాత్తు రాంబాబు అనే పిలుపు వినిత్రుల్లి పడిలేచాడు. స్త్రీ కంఠస్వరం, “రజనీ” అని లేచాడు. ఆ కంఠస్వరం కిలకిలా నవ్వి “కాదు రాంబాబు చంద్రికని ఇదేం అన్యాయం చెప్పండి. యిక్కడ నిద్రపోతున్నారు? అంది. “అందరూ నాకు అన్యాయం చేసే వారే చంద్రకా? చివరకునువ్వు కూడా అంతే. తీయని కలలు కంటూ నిద్రపోతున్న నన్ను లేపావు” అన్నాడు. చంద్రిక “కలలతోను, కథలతోనుతృప్తి పడవలసిన అవసరం మీకెందుకు? అయితే మా పిన్ని యింట్లో లేదా? అంది. “ఉంటే బయట తాళం వేసి