అప్రాశ్యులు - 4

  • 12k
  • 2.9k

అప్రాశ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) 4 కమల మనస్సు ఎందుకో అశుభం సూచించింది. రజని మనస్సులో చాలా అశాంతి చేల రేగింది. మాటిమాటికి ఆమెకు పీడకల జ్ఞాపకానికి వచ్చింది. ప్రసాద్ రజని కారులోవెళ్తుండగా కారు యాక్సిడెంటు అయినట్లు కలవచ్చింది. కాని ఆమె అది ఎవరికి చెప్పలేదు. వ్యాకులపాటుతో మనస్సు సతమతమవుతున్నా ఆమె బయట కేమి వెల్లడించకుండా లోలోనే అణచుకుంది. అలాంటి పరిస్థితిలో అబలలు గుండెలవిసే కంటతడి పెట్టి బావురుమంటారు. అదే కమల అయితే భయంతో ఆతృతతో చేతనారహిత ఆవును కానీ, రజని నిండుకుండలాంటిది. మనస్సులోని పెనుగాలి మరగు పరచి పైకి మామూలుగానే వుంది రజని. “నా అనుమానం ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయార” ని అని మాత్రం అంది. “మనల్నందరినీ ఇక్కడ వదలి ఎలా వెళ్తాడు! అయినా దానికి తగిన వాడే బొత్తిగా మేనర్స్ లేవు.” రామం మండిపడుతూ అన్నాడు. కమల కూడా “ఆహ్వానించి యిక్కడకు తీసుకువచ్చి యిలా అవమానిస్తారని నేనూహించలేదు.