మంచు తో మృత్యు పోరాటం

  • 17.5k
  • 3.3k

తెల్లవారుఝామున మంచి నిద్ర లో ఉన్న మాలతి కి లాండ్లైన్ ఫోన్ మ్రోగటం తో మెలకువ వచ్చింది. ఫోన్ లో అవతల వ్యక్తి చెప్పిన విషయం విని షాక్ కు గురయ్యింది. కొద్ది సేపటికి తేరుకున్న మాలతి లేచి వెంటనే టివి పెట్టింది. టివి లో వార్తలు వస్తున్నాయి.. భారత కీలక సరిహద్దు ప్రాంతం అయిన సియాచిన్ లో మంచు తుఫాను కారణంగా పది మంది సైనికులు మంచులో కూరుకు పోయినట్లు సమాచారం. వారి జాడ కోసం గాలిస్తున్నారు. సిమ్లా ఒప్పందం వరకు భారత దేశం గాని, పాకిస్థాన్ గాని సియాచిన్ గురించి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆ ప్రదేశం పాకిస్థాన్ కు బలమైన స్థావరంగా మారుతోందని తెలియటం వల్ల భారత దేశం 1984 లో మొదటి సారి భారత్ సియాచిన్ లోని కీలకమైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. సియాచిన్ ప్రపంచం