అను పల్లవి

  • 23.9k
  • 1
  • 6.9k

అపార్ట్మెంట్ పార్కింగ్ లో కార్ పార్క్ చేసి లెటర్ బాక్స్ లో లెటర్స్ కోసం వెతికాను. అరవింద నేత్రాలయం నుండి వచ్చిన ఉత్తరం ఉంది. టు అనురాధా అండ్ అనిరుధ్ అని అడ్రసు లో రాసి ఉంది. పాత అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి పంపినట్లున్నారు. చేత్తో అందమైన డ్రాయింగ్ వేసి దాని పైన హ్యాపీ న్యూ ఇయర్ అని విషెస్ రాసి ఉన్నాయి. ఎంత అందమైన డ్రాయింగ్ వేశారు, నా బుజ్జి పిల్లలు - కళ్ళు ఉన్న వారి కంటే ప్రపంచాన్ని ఎంత అందంగా చూపించారు అని మురిసిపోయాను. అనిరుధ్ కి నాకు ప్రేమ కు గుర్తు గా మిగిలింది వీళ్ళు. మూడు సంవత్సరాల క్రితం నా బర్త్డే కి అనిరుధ్ నన్ను ఈ ఆశ్రమానికి తీసుకు వెళ్ళాడు. అందులో నుండి ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని వారికి చదువు చెప్పిస్తున్నాం. వారి నుండి వచ్చినవే ఈ కార్డ్ లు. ప్రతి