జోరా

  • 12.5k
  • 1
  • 3.4k

కొన్ని సంవత్సరాల క్రితం అశోక పురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి పక్కన ఒక అడవి ఉండేది.ఆ గ్రామానికి అడవికి మధ్యలో ఒక ఉపాధ్యాయుడి ఇల్లు ఉండేది.ఆ ఉపాధ్యాయుడి పేరు వీర. వీర ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్న పిల్లలకు పాఠాలు చెప్పేవాడు. వీరా ప్రతిరోజు పిల్లలకు అక్షరాలు నేర్పేవాడు. వీర ఇంటి వెనుక నుండి అడవి మొదలవుతుంది. వీర ఇంటి వెనుక ఒక నక్క నివాసం ఉండేది.వీర ప్రతి రోజు సాయంత్రం పిల్లలకు పాఠాలు చెప్పడం పూర్తయిన తర్వాత, రాత్రి ఆ నక్కకు ఆహారం ఇచ్చేవాడు. కాబట్టి ఆ నక్కకు వీరా అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు సాయంత్రం నక్క వీర ఇంటి వద్దకు వెళ్లి వీర చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేది. అక్షరాలు నేర్చుకునేది. పాఠాలు చెప్పడం పూర్తయ్యాక వీరు ఇచ్చే ఆహారం తిని తన నివాసానికి తిరిగి వెళ్లి నిద్రించేది. ఆ అడవికి రాజు మగ సింహం.