అష్టావధానం స్క్వేర్ సాఫ్ట్వేర్

  • 12.8k
  • 2.9k

కరొన వచ్చినప్పటి నుండి నాకు ఎందుకో నచ్చటం లేదు అందరూ నన్ను ఒక వైరస్ లా చూస్తున్నారు. అదేమిటి అంటారా, మీకు తెలియదు కదూ నా పేరు కరుణ. “మన ఇంట్లో కొన్ని రోజులు ఇడ్లీ, టి బంద్” అని కిరణ్ వంట గది లో నుండి ఉత్తర్వులు జారీ చేశాడు. “ఇవి బాగా అట్టగట్టుకు పోతున్నాయి” అని కారణం కూడా చెప్పాడు. కరొన మొదలైనప్పటి నుండి గిన్నెల డ్యూటి ఆయనదే కదా. భర్త అనే అధికారం చూపించటం కాదు సహకారం ముఖ్యం అని ఉపన్యాసం ఇచ్చి మరీ ఈ డ్యూటి నెత్తిన వేసుకున్నాడు. దానికి తోడు రాజమౌళి గారు స్టార్ట్ చేసిన #రియల్ మ్యాన్ ఛాలెంజ్ ఒకటి. మా రియల్ మ్యాన్ కిరణ్ మాత్రం వీడియొ రికార్డు అయిపోయాక కూడా రోజూ డ్యూటి చేస్తూనే ఉన్నాడు. “అది సరే గాని మీరు గోరు చిక్కుడు, బీన్స్ తేవద్దు. వొలవటానికి బోలెడు