" మీరేమీ అనుకోకపోతే మీకొక మాట చెప్తాను సార్ "." ఏంటది? కృష్ణమూర్తి గారు చెప్పడానికి ఏముంది " . "సార్ ..! ఇన్నేళ్లు ఈ కంపెనీ బాద్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు . మీరు మా లాంటి పనివాల్లపై చూపించే ప్రేమ , గౌరవం ఇంకెవరూ చూపించలేరేమమో ? , మరి మీకు కూడ వయస్సు పెరిగిపోతోంది ...అందుకని.... " "ఆ అందుకని ఏంటో చెప్పుండి కృష్ణమూర్తి గారు " . "ఏం లేదు సార్ మీ తర్వాత మీ కొడుకు అరుణ్ మమ్మల్ని , ఈ కంపెనీని బాగా చూసుకుంటాడని భావిస్తున్నాము సార్"." ఏంటి ?. అరుణ్ మీద మీకున్న విశ్వాసం నాకు నచ్చింది .కానీ వాడికి ఇంకా వాడి బాధ్యతల గురించి సరిగ్గా తెలీదు . వాడి కన్నా అర్జున్ కే బాద్యతలు గురించి ఎక్కువగా తెలుసు అని నేననుకుంటున్నాను కృష్ణమూర్తి గారు " " అదేంటి సార్ ఎంతైనా అరుణ్ పెద్దవాడు