ఆది పిత - 1

  • 16.5k
  • 4.3k

ఓంశాంతి.. భగవద్భంధువులారా... ఆత్మిక, ఆత్మీయ సోదర సోదరీ మణులారా ... ఒక మహాద్భుతమైన ఘనతను సాధించిన ఈ మహా యుగ పురుషుని యదార్ధ జీవిత గాధను పఠించి పులకించి తరించనున్న మీ అందరికీ ముందుగా మనః పూర్వక అభినందనలు ... హృదయ పూర్వక శుభాకాంక్షలు . సర్వ సాధారణంగా ప్రతి మానవుని జీవితం లో గడిచిపోయినా కాలాన్ని గతం అంటారు 'గతం గతః' అని మర్చి పొమ్మంటారు. కానీ కొందరి గతాన్ని మాత్రం మనం ఇప్పటికీ చరిత్రగా చదువుకుంటున్నాం. అంతే కాక ఆ మహనీయుల జీవన విధానాలను నిత్య జీవితం లో ఆచరించటం ద్వారా ఆ మహనీయుల సమానంగా కావాలన్న శ్రేష్ఠ సంకల్పం నిరంతరం చేస్తూనే వున్నాం. ఇది ఎంతగానో అభినందించదగిన విషయం.వాస్తవానికి ప్రతి మానవుని అంతరంగం లో ఎన్నో దివ్య గుణాలు,మరెన్నో ప్రత్యేకమైన విశేషతలు.. ముత్యపు చిప్ప లో దాగిన ముత్యాలవలె సాగర గర్భం లో