ఖగోళశాస్త్రం - సైకిల్స్

  • 12.2k
  • 1
  • 3.1k

చీకటి ఆకాశంలో మనం కొన్ని వేల నక్షత్రాలు చూడవచ్చు. కొన్ని గంటలు మీరు గమనిస్తే ఆకాశంలో నక్షత్రాలు ఒక రోజులో ఉదయించడం, అస్తమించడం చూడవచ్చు. మరుసటి రోజు మీరు అదే సమయంలో ఆకాశాన్ని గమనిస్తే మీరు మళ్ళీ అదే గమనిస్తారు. నక్షత్రాలు ఉదయిస్తూ, అస్తమిస్తూ వుంటాయి. పొలారిస్ ఉత్తరాన అలానే కదలకుండా అలానే వుంటుంది. ఒక్క రోజులో ఆకాశం లో ఎటువంటి తేడాలు కనపడవు. ఒకవేళ మీరు ఒక వారం ఓపికగా ఉండి గమనించగలిగితే ఆకాశంలో కొంత మార్పుని చూడవచ్చు.కొన్ని వారాలు గడిచిపోయాయి అనుకుందాం. సూర్యుడు అస్తమించిన తరువాత తూర్పున వున్న ఒక చెట్టుపై వున్న నక్షత్రాన్ని గుర్తుతెచ్చుకొండి. దాన్ని మళ్లీ గమనించండి. మీరు ఆ నక్షత్రం అదే స్థానం లో వుంటుంది అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఆ నక్షత్రం తన స్థానం కంటే కొంచెం పైకి వుంటుంది. మీరు పశ్చిమాన చూస్తే గతవారం హారిజన్ దగ్గర ఉన్న