ఖగోళశాస్త్రం - గమనించడం

  • 23.9k
  • 1
  • 4.9k

మనం ఆకాశం లో వున్న నక్షత్రాలు చూడటానికి మన కళ్లు, మంచి నల్లని ఆకాశం వుంటే చాలు. మన పూర్వికులు ఇలానే ఖగోళశాస్త్రం కనుగొన్నారు. ఆకాశం వైపు చూస్తూ ఈ విశ్వాన్ని అధ్యయనం చేయడం చాలా అద్భుతమైన విషయం.మీరు ఊహించుకోండి మీరు పట్టణ కాంతి కి దూరం వున్నారు, ఆకాశంలో మబ్బులు లేకుండా చాలా నల్లగా వుంది. సూర్యుడు అస్తమించాడు. కొన్ని నిమిషాలు నల్లటి ఆకాశం చూస్తారు. కొంత సమయం తరువాత తూర్పున ఒక నక్షత్రం కనపడుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఇలా ఒక గంట తరువాత ఆకాశం మొత్తం నక్షత్రాలతో నిండిపోతుంది. మనం మామూలు కంటి చూపుతో కొన్ని వేల నక్షత్రాలు చూడగలం. మీ కంటి చూపుని బట్టి నక్షత్రాలు కనపడతాయి. మీరు ఇప్పుడు ఒకటి గమనించవచ్చు అన్ని నక్షత్రాలు ఒకేలా ప్రకాశించవు. కొన్ని చాలా ప్రకాశవంతం గా వుంటే కొన్ని మామూలుగా ప్రకాశిస్తూ వుంటాయి. కొన్ని చాలా తక్కువ ప్రకాశవంతంగా