ఆక్సిజన్ - ప్రాణవాయువు ఎలా ఏర్పడుతుంది.

  • 14.8k
  • 3.7k

మనం మన భూమిని చాలా తేలికగా తీసుకుంటాము అలాగే చాలా వాటిని తేలికగా తీసుకుంటాము అలాంటి వాటిలో చాలా ముఖ్యం అయింది శ్వాస. మనకి తెలిసినంతవరకు మనకి ఆక్సిజన్ కేవలం చెట్ల వల్ల మాత్రమే వస్తుంది. కానీ మనకి ఆక్సిజన్ ఒక సూక్ష్మజీవి నుండి కూడా వస్తుంది.శ్వాస కంటే సహజంగా జరిగేది లేదు. మనకి తెలిసినంత వరకు అది కేవలం భూమి మీద మాత్రమే జరుగుతుంది. ఒకవేళ భూమి మీద ఆక్సిజన్ లేకపోతే జీవం వేరేలా వుంటుంది. దానికి వుదాహరణ మన భూమి మీదనే వుంది అదే డెలోల్ అనే ఏరియా. ఇక్కడ గాలి చాలా విషపూరితంగా వుంటుంది. ఇక్కడ గాలి లో ఆక్సిజన్ కాదు హైడ్రోజన్ సల్ఫేట్ వుంటుంది. నేల లో నుండి నీరు కాదు యాసిడ్ వస్తుంది. ఇక్కడ స్వచ్ఛమైన నీరు వుండదు అందుకే ఇక్కడ జంతువులు, పక్షులు, చెట్లు వుండవు. కానీ ఇక్కడ కొన్ని జీవులు వున్నాయి.