(అది ఒక పార్కు ఆ పార్కులో ముగ్గురు మిత్రులు దిగులుగా కూర్చుని ఉన్నారు . వారి మధ్యన సాగుతున్న సంభాషణ ఇలా ఉంది) మొదటి వ్యక్తి: రమేష్ మనం మన సమస్యలనుండి గట్టెక్కాలంటే ఇంతకంటే మరోమార్గం లేదంటావారెండో వ్యక్తి: అవును రమేష్ నువ్వు మరోమారు ఆలోచించు ఉమేష్ అంటున్న మాటలు వింటుంటే నాకు కూడా మనం తొందరపడుతున్నామేమోనని అనిపిస్తోందిరమేష్: ఆపరా ..సతీష్ నువ్వూ ఈ ఉమేషుగాడు ఇద్దరూ చవట దద్దమ్మలు.. శుద్ధ మొద్దులు... పిరికి సన్నాసులు...మిమ్మల్ని స్నేహితులుగా చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది.