ఎపిసోడ్ 11
అఖిరా, అభయ్ చాలా సంతోషంగా ఉన్నారు. ఒకళ్ల మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అనే అనుభూతిలో మునిగిపోయారు. ఒక క్షణం ఆనందం కలిగితే, మరో క్షణం కంగారు మొదలైంది.
పిన్ని అఖిరా కంగారు పడడం చూసి దగ్గరికి వచ్చి,
“ఏమైంది అఖిరా?” అని అడిగింది.
అఖిరా పిన్నిని గట్టిగా కౌగిలించుకుని,
“అసలు నేను ఏం చేసాను పిన్ని?” అని అడిగింది.
పిన్నికి ఏమి అర్థం కాలేదు.
“అసలు నువ్వు దేని గురించి అడుగుతున్నావు అఖిరా?” అని ఆందోళనగా అడిగింది.
అఖిరా కన్నీళ్లు పెట్టుకుని,
“నేను అభయ్‌ని ప్రేమిస్తున్నాను. వైభవ్ నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నేను ప్రేమించట్లేదు అని చెప్పాక కూడా మళ్లీ మళ్లీ నన్నే కావాలి అని ఎందుకు అంటున్నాడో తెలియట్లేదు పిన్ని,” అని చెప్పింది.
సుమిత్ర (పిన్ని) సానుభూతిగా,
“దానికే ఎందుకు కంగారు పడుతున్నావు? రేపు ఆ వైభవ్‌తో ఒకసారి స్పష్టంగా మాట్లాడి, ఒకేసారి ఆ చాప్టర్ క్లోజ్ చేసేయ్. అన్నీ సర్దుకుంటాయి. కంగారు పడకు. ఇంకేమీ ఆలోచించకుండా పడుకో,” అని చెప్పి వెళ్లిపోయింది.
అఖిరా కూడా,
“రేపు ఫుల్ అండ్ ఫైనల్‌గా వైభవ్‌తో మాట్లాడి ఈ చాప్టర్‌ని క్లోజ్ చేయాలి,” అని అనుకుంటూ పడుకుంది.
తెల్లారగానే అఖిరా ఫోన్‌లో మెసేజ్ సౌండ్ మోగుతూనే ఉంది. నిద్ర కళ్లలోనే,
“ఏంటి ఇన్ని మెసేజ్‌లు వస్తున్నాయి?” అని కళ్లను నలుపుకుంటూ చూసింది.
“గుడ్ మార్నింగ్”, “హౌ ఆర్ యు?”, “హ్యాడ్ కాఫీ?” అని ఒకటి తర్వాత ఒకటి మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి.
చివరికి “Vaibhav here” అని పేరు చూసింది.
ఆ పేరు చూడగానే అఖిరా కళ్లలో కోపం మెరిసింది.
“ఈరోజు వీడి సంగతి చెప్తాను,” అని అనుకుని “కాలేజ్ బయట కలుద్దాం, మాట్లాడాలి” అని మెసేజ్ చేసింది.
అటు వైపు నుంచి
“Ok, I will wait” అని రిప్లై వచ్చింది.
అఖిరా కోపంగా త్వరగా రెడీ అవుతూ,
“పిన్ని, నేను కాలేజ్‌కి బయలుదేరుతున్నాను,” అని చెప్పింది.
వంటగది నుంచి పిన్ని,
“టిఫిన్ చేసి వెళ్లవే!” అని అరిచింది.
“టైమ్ లేదు పిన్ని, బై,” అని చెప్పి బయలుదేరింది.
చెప్పినట్టుగానే అఖిరా కోసం వైభవ్ కాలేజ్ బయట ఒక కాఫీ షాప్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాడు.
అఖిరా వచ్చింది.
వైభవ్ నవ్వుతూ,
“హలో అఖిరా… ప్లీజ్ హ్యావ్ ఏ సీట్,” అని పలకరించాడు.
అఖిరా ఇంకా కోపంగానే ఉంది. కూర్చుంది.
వైభవ్ మెను కార్డ్ తీసి,
“Will you have something?” అని ఇచ్చాడు.
అఖిరా మెను కార్డ్‌ని లాగుకుని గట్టిగా టేబుల్ మీద పెట్టింది.
వైభవ్ శాంతంగా,
“కామ్ డౌన్… ఏమైంది?” అని అడిగాడు.
అఖిరా గట్టిగా,
“నీకు తెలియదా ఏమైందో?” అని అరిచేలా అయ్యింది. కానీ వెంటనే గట్టిగా ఊపిరి పీల్చుకుని తనని తాను శాంతపరిచుకుంది.
తర్వాత నెమ్మదిగా,
“నీకు తెలియదా ఏమైందో? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా?” అని అడిగింది.
వైభవ్ ఏమీ అర్థం కానట్టు నవ్వుతూ,
“దేని గురించి అడుగుతున్నావు నువ్వు?” అని అడిగాడు.
అఖిరా కోపాన్ని అదుపు చేసుకుని,
“సరే. ఇప్పుడు ఫుల్ అండ్ ఫైనల్‌గా క్లారిటీ ఇస్తున్నాను. విను. మళ్లీ నా దారిలో రాకూడదు. నేను అభయ్‌ని ప్రేమిస్తున్నాను. అభయ్ నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు. నాకు నువ్వు నచ్చలేదు. ఇంతకంటే సూటిగా నేను ఎలా చెప్పాలి? నీకు అర్థం అవుతుందా? నన్ను వదిలేయ్,” అని చెప్పింది.
వైభవ్ ఆశ్చర్యంగా,
“ఎందుకు నన్నంటే నీకు నచ్చలేదు? మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. I own a company. మంచి రిచ్ ఫ్యామిలీ. నేను చూడటానికి కూడా బాగుంటాను కదా. I can give everything you need. నువ్వు దేనికి కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు అడగకముందే నీకు ఏమి కావాలో అన్నీ చూసుకుంటాను. ఇంకేం కావాలి నీకు?” అని అడిగాడు.
అఖిరా,
“ఇదే నచ్చలేదు నాకు,” అని చెప్పింది.
వైభవ్‌కు ఏమీ అర్థం కాలేదు.
అఖిరా నవ్వుతూ,
“నువ్వు చెప్పినవన్నీ కావాలి అనుకునే ముందు ప్రేమ ఉండాలి కదా,” అని చెప్పింది.
వైభవ్,
“అవి ఉంటే ప్రేమ వస్తుంది కదా. ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది కదా,” అని అన్నాడు.
అఖిరా చిన్నగా నవ్వుతూ,
“అయితే ఇన్నాళ్లు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు వైభవ్. కంఫర్ట్ వేరు, లవ్ వేరు. కంఫర్ట్ ఉంటే ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నువ్వు చెప్పిన బ్యాక్‌గ్రౌండ్, మంచి ఫ్యామిలీ, నువ్వు ఓన్ చేసే కంపెనీ, నీ రిచ్‌నెస్ ఇవన్నీ ఈరోజు ఉంటాయి రేపు పోతాయి. వీటికి గ్యారెంటీ లేదు.”
“కానీ లవ్ అలా కాదు. ఏం ఉన్నా లేకపోయినా లవ్ మారదు. ఒకసారి ఒక మనిషి మీద ప్రేమ పుడితే చచ్చే వరకు అలాగే ఉంటుంది. చచ్చాక కూడా ఆ ప్రేమ మారదు. It’s permanent.”
“నువ్వు చెప్పినవన్నీ ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటుంది. మారదు. అలాంటి ప్రేమ నాకు అభయ్ మీద కలిగింది. నిన్ను కలవకముందే, నీకన్నా ముందే నా మనసులో తనకే స్థానం ఉంది. వేరే ఎవరికీ ఇవ్వలేను కూడా,” అని సమాధానంగా చెప్పింది.
వైభవ్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. అఖిరా చెప్పిన మాటలు అతని మనసుకు చాలా గట్టిగా తాకాయి.
ఒక్కసారిగా అతని గతంలో జరిగిన ఒక విషయం గుర్తుకు వచ్చింది.
“కంఫర్ట్ కన్నా ప్రేమే ముఖ్యమా? ప్రేమలో ఉంటే కంఫర్ట్ అవసరం లేదా?” అని అడిగాడు.
అఖిరా,
“అవును. ప్రేమ ఉంటే చాలు. ట్రూ లవ్ అయితే ఏం ఉన్నా లేకపోయినా ఆ మనిషి చెయ్యి వదలకుండా ఎప్పటికీ తోడుగా ఉంటారు. ట్రూ లవ్ లేకపోతే ఎంత ఆస్తులు ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి విడిపోతారు,” అని చెప్పింది.
వైభవ్ ఒక్కసారిగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు.
అఖిరాకు ఏమి అర్థం కాలేదు.
“ఇకపై నువ్వు నా వెనక రాకూడదని అనుకుంటున్నాను వైభవ్,” అని తనలో తానే అనుకుని క్లాసులకు వెళ్లిపోయింది.
వైభవ్ కారులో కళ్లను మూసుకుని తన గతాన్ని తలుచుకుంటున్నాడు.
ఫ్లాష్‌బ్యాక్:
చిన్నప్పుడే వైభవ్ వాళ్ల అమ్మ, వాళ్ల నాన్న దగ్గర డబ్బులు లేవు అని కంఫర్ట్ ఉంటేనే ప్రేమ ఉంటుంది అని తన అవసరాలు తీరడం లేదని వైభవ్‌ని మరియు గోకుల్ నందాని వదిలి మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ఆ సంఘటన చిన్న వయసులోనే వైభవ్ చూసాడు.
ఆ రోజు నుంచి “డబ్బులు ఉంటేనే ప్రేమ ఉంటుంది” అనే నమ్మకం అతనిలో బలంగా పడింది.
ఇప్పుడు అఖిరా చెప్పిన మాటలు అతని మనసును కదిలించాయి. ఆమె మీద ప్రేమ ఇంకా పెరిగింది.
కళ్లను తుడుచుకుని,
“నువ్వు నాకు కావాలి అఖిరా… సారీ, but I need you,” అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేయడం ప్రారంభించాడు.
ముందుకు కొనసాగుతుంది…