యంత్రం ఐదు గంటలు................వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది....
రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్నడుచుకుంటూ ఇళ్ళకు చేరుతున్న జనం,
అలసిపోయి ఆ చల్లటి గాలికి సేద తీరుతూరేపటి పని ఒత్తిడి ని తలుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు,
పని చేసి రిటైర్ అయి ఈవినింగ్ వాక్ కివచ్చిన వాళ్ళు ఇలా సందడిగా ఉంది అంతా.
ఆగండి ఆగండి ఇక్కడ ఎవరో టెన్షన్ పడుతూఉన్నాడు ఇతను ఎవరో చూద్దాం....
నేను మీకు వివరాలు పంపి ఎన్ని రోజులుఅయింది తెలుసుకోవడం అంత కష్టమా
ఎన్ని రోజులు కొంచెం త్వరగా తెలుసుకోండి అంటున్నాడు
సరే పోదాం పదండి మనం వెళ్దాం.....
ఒక బైక్ వస్తోంది.పాతిక సంవత్సరాల వయసుఉన్న అమ్మాయి డ్రైవ్ చేస్తోంది.
వెనకాల ఇంకో అమ్మాయి ఉంది సేమ్ వయసుఉంటుంది
ఇద్దరూ ఎందుకో టెన్షన్ పడుతున్నారు.బైక్నడిపే అమ్మాయి వెనకాల ఉన్న అమ్మాయితో
ఊరుకో రజనీ ఏం కాదు అక్క క్షేమంగాఉంటుంది మనం ఎంచక్కా బేబీ తో వస్తుంది అంది.
ఏమోనే అక్క ప్రెగ్నెన్సీ కన్ఫాం అయినదగ్గర్నుంచి అంతా కంగారే ఏదో ఒక టెన్షనే
హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆ హాస్పిటల్వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్స్ అయిపోయారు
ఇప్పుడు కూడా కంగారే అమ్మ తో చెప్పాను ఊరువెళ్శొద్దు నాన్న వెళ్తారు అని వినకుండా వెళ్ళింది
అలా వెళ్ళింది ఇలా మొదలుపెట్టింది అక్క అమ్మో తలచుకుంటే భయం వేస్తోంది
అక్కా అత్తగారు ఆ నోరు వేసుకునిపడిపోతుంది వామ్మో అని
ఆ దేవుడి దయ వలన అంతా మంచి జరిగి తల్లీబిడ్డా క్షేమంగా ఉంటే చాలు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాను అంది.
ఊరుకో రజనీ అంది బైక్ నడిపే అమ్మాయి.
వెనక కూర్చున్న అమ్మాయి పేరు రజనీ.
నీకు ఏం తెలుసు నా బాధ అంది రజనీ.
అబ్బా ఉంటారు లే కంగారు పడకు వెళ్తున్నాంకదా ట్రాఫిక్ కూడా అంతలా లేదు కూడా అంది నడుపుతున్న అమ్మాయి.
ఇంతలో ఏయ్ ఏయ్ ఆగండి బైక్ ఆపండి అంటూఆపేసాడు కానిస్టేబుల్
సచ్చినోడు ఆపేసాడు వీడి మొహం మండ అనిఅందుకుంది బైక్ నడుపుతున్న అమ్మాయి
ఊరుకోవే అని ఆగగానే దిగి ఏమైంది సార్అంది రజనీ.
బైక్ నడుపుతున్న అమ్మాయి దిగి ఏమైందిఎందుకు ఆపారు అంది
చెక్ చేయాలి జరగండి అని ఇద్దరినీ పక్కకి జరిపాడు కానిస్టేబుల్
నడిపే అమ్మాయి కోపంగా వెళ్తుంటే రజనీ ఆపిఆగవే నేను మాట్లాడతాను టైం అవుతుంది అంది
ఆ అమ్మాయి ఆగింది.రజనీ వెళ్ళి సార్హాస్పిటల్ కి వెళ్ళాలి వదిలేయండి సార్ అంది
పేపర్లు లేవు హెల్మెట్ లేదు మీ లైసెన్స్ ఏది? ఆర్సీ ఏది? అన్నాడు కానిస్టేబుల్
ఉన్నాయి సార్ తీసుకొస్తాను అని ఆ అమ్మాయిదగ్గరకు వెళ్ళి నీ హ్యాండ్ బ్యాగ్ ఏది అంది రజనీ
ఆ అమ్మాయి బైక్ వైపు చూసి అవును ఏది నా హ్యాండ్ బ్యాగ్ ఏది అంది రజనీతో
కానిస్టేబుల్ బైక్ పక్కకి తీసి రండి ఇటు ఫైన్ కట్టి స్టేషన్ కి వచ్చి తీసుకుని వెళ్ళండి అన్నాడు
ఆ అమ్మాయి కి చాలా కోపం వచ్చింది కానీ రజనీ మొహం చూసి కంట్రోల్ చేసుకుంది
అయ్యో సార్ అలా అనకండి మేము అర్టెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి అంది రజనీ
కుదరదు రేపు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని వేరే అతనితో ఆ బైక్ చూడండి అన్నాడు కానిస్టేబుల్
ఆ అమ్మాయి వచ్చి సార్ ఫైన్ కడతాను కానీ బైక్ వదిలేయండి మేము వెళ్ళాలి లేదంటే
అక్కడ తల్లీ బిడ్డా ఇద్దరు ప్రాణాలు రిస్కులో పడతాయి కావాలంటే చూడండి అని
రిపోర్టులు మందుల కవర్లు చూపించింది.
ఇంతలో సార్ మా అక్క సార్ సమయానికి మా పేరెంట్స్ కూడా ఊర్లో లేరు
మేము వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్ అంది రజనీ ఏడుస్తూ
ఇంతలో కానిస్టేబుల్ తన పై ఆఫీసర్ పిలవడంతో ఒక్క నిమిషం అని వీళ్ళతో చెప్పి వెళ్ళాడు
ఆ అమ్మాయి కి చాలా భాధగా అనిపించింది కారణం రజనీ గుర్తు చేసింది కార్డు ఉంది
పర్స్ ఉంది వద్దులే అంది ఇప్పుడు ఇలా ఆపేసారు వాళ్ళకి ఏమైనా అయితే అసలు
ఆ ఊహ కూడా భరించలేక ఫైన్ ఎంత సార్ అంది ఆఅమ్మాయి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి
కానిస్టేబుల్ చెబుతుంటే కారులో ఉన్న వ్యక్తి పిలిచారు
ఒక్క నిమిషం సార్ పిలుస్తున్నారు అని వెళ్ళిపోయాడు కానిస్టేబుల్
ఆ అమ్మాయి రజనీ దగ్గరకు వచ్చి నేను బైక్వ తీసుకుని వస్తాను నువ్వు హాస్పిటల్ కి వెళ్ళు
లేట్ అయ్యేలా ఉంది ఆటోలో వెళ్ళిపో అక్కడ ఏం అవసరం ఉందో ఏంటో కంగారు పడకు అంది
రజనీ చేతికి కవర్లు ఇచ్చి రా అని ఆటోని పిలిచి ఎక్కించి డబ్బులు ఇచ్చి ఇదిగో కార్డు
వాడేయ్ ఏదైనా ఉంటే బావగారికి ఫోన్ చేయి ఏం కాదు కంగారు పడకు అంది ఆ అమ్మాయి
సరే నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోకు అసలే పోలీసు అంటే నీకు కోపం త్వరగా వచ్చేయ్ అంది రజనీ
ఈ టైంలో కోపం ఏంటే నువ్వు జాగ్రత్త అని ఆటోని పంపించి వెనక్కి తిరిగి చూసింది ఆ అమ్మాయి
ఆ కానిస్టేబుల్ పది నిమిషాలు తర్వాత వచ్చి రసీదు ఇచ్చాడు ఆ అమ్మాయి కి
ఆ అమ్మాయి రసీదు చూసి థాంక్యూ సార్ అని డబ్బులు ఇవ్వాలని తీస్తుంటే
కీస్ ఇచ్చి అవసరం లేదు మీరు వెళ్ళండిఅన్నాడు కానిస్టేబుల్
అదేంటి సార్ రసీదు ఇచ్చారు కదా అమౌంట్ ఇవ్వాలి కదా అంది ఆ అమ్మాయి
అవసరం లేదు మేడమ్ మా సార్ ఇచ్చారు మీరు వెళ్ళండి అని
వేరే వెహికల్ చెకింగ్ కి వెళ్ళాడు కానిస్టేబుల్
అచ్చా పోలీసోళ్ళకి తినడమే తెలుసు ఇవ్వడం అని ఇలాంటి పనులు కూడా చేస్తారా
ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా డిపార్ట్మెంట్లో అనుకుంటూ బైక్ ఎక్కి స్టార్ట్ చేసింది
జస్ట్ అలా ముందుకి వెళ్ళి ఆగి థాంక్స్ చెప్పకుండా వెళ్తున్నాను ఇంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా అని ఆగి స్టాండ్ వేసి వెనక్కి వచ్చింది ఆ అమ్మాయి
కానిస్టేబుల్ చెప్పిన అతను సార్ కారు నుంచి దిగి అటు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నాడు
అతను సీ ఐ మురళీ కృష్ణ.ఆ స్థాయి మనిషి రావడం ఏంటి చెకింగ్ కి అంటే
ఎవరో గన్స్ తో తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ అందుకే మొత్తం రౌండ్స్ వేస్తున్నారు
ఆరు అడుగులు ఎత్తు ఎత్తుకు తగ్గ ఫిజిక్ వెనుక నుంచి చూసి పర్లేదు అనుకుంటూ
ఈ అమ్మాయి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అంది వెనక్కి తిరిగాడు అతను
ఆ అమ్మాయి కళ్ళనిండా నీళ్ళతో కోపంతో చూసింది అతని వంక
నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేసి ఏదో అనాలని నోరు తెరిచాడు
ఆ అమ్మాయి చేత్తో మాట్లాడొద్దు అని చూపించి అక్కడ నుంచి బైక్ దగ్గరకు వచ్చి
పర్స్ తీసుకుని వెళ్తుంటే కానిస్టేబుల్ వచ్చి మేడమ్ మీ బైక్ అన్నాడు.
ఆర్సీ లైసెన్స్ హెల్మెట్ లేకపోతే ఏంచేస్తారు అంది ఆ అమ్మాయి
ఫైన్ రాసి బైక్ స్టేషన్ కి తీసుకునివెళ్తాం అన్నాడు కానిస్టేబుల్
అదే చేయండి నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అంది ఆ అమ్మాయి
కానీ సార్ పే చేసారు మీరు రావాల్సిన అవసరం లేదు మేము తీసుకుని వెళ్ళడం
రెండు అవసరం లేదు పే చేసాక ఇంకా ఎందుకు అన్నాడు కానిస్టేబుల్.
మీ సార్ ఎందుకు కట్టారు ఆయన ఎవరు కట్టడానికి హా ఇలా లేని వాళ్ళు అందరికీ ఆయనే కడుతున్నారా
అక్కడ చాలా మంది నిలబడిఉన్నారు కదా అంది అ అమ్మాయి
చూడండి మేడమ్ పోనీలే ఆడపిల్ల హాస్పిటల్ అన్నారు అని మా సార్ కట్టారు అన్నాడు కానిస్టేబుల్
హలో వేసిన బుర్రకథ ఊదిన బాకా చాలు అటు చూడు అక్కడ ఉన్నది ఆడపిల్లలే
అందరికీ ఏవో ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి వెళ్ళి కట్టమని చెప్పు అందరికీ ఫైన్ అంది ఆ అమ్మాయి వెటకారంగా
మేడమ్ చాలా రాంగ్ గా మాట్లాడుతున్నారుపోనీలే అని జాలిపడి పే చేస్తే థాంక్స్ చెప్పకుండా అలా మాట్లాడతారే అన్నాడు కానిస్టేబుల్
జాలి పడ్డారా అని జాలి ఎవరు ఎవరి మీద పడతారో తెలుసా అంది ఆ అమ్మాయి
హా తెలుసు మేడమ్ ప్రాబ్లం లో ఉన్న వాళ్ళని చూసి మనసున్న వాళ్ళు జాలిపడతారు
మా సార్ లాంటి మంచివాళ్ళు ఇదిగో ఇలా జాలితో పాటు హెల్ప్ కూడా చేస్తారు అన్నాడు కానిస్టేబుల్
ఆ అమ్మాయి కోపంగా సీ ఐ వంక చూస్తూ మీ సార్ జాలిపడేంత దీనస్థితిలో నేను లేను అని
మంచివాడు మంచివాడు అని ఇందాకటి నుంచి ఓ చించుకుంటున్నావ్
మంచివాడు అంటే మనసు ఉండాలి మంచితనం అంటే ఆ మనసు స్పందించడం
మనసు ఉంటే కష్టం తెలుస్తుంది ఇష్టం అర్ధం అవుతుంది మనల్ని ఇష్టపడే మనసు విలువ తెలుస్తుంది
ఆ మనసు అబద్దమా నిజమా అర్థం అవుతుంది మోసం చేయాలని
ముక్కలు చేయాలని అనిపించదు కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం అబద్దంలా అనిపించదు అని
మనసున్న మంచివాళ్ళుమనుషుల మీద జాలిపడతారు మీ సార్ కి
అవి రెండూ లేవు అని వెళ్తూ వెనక్కి తిరిగి అందరి లాగా నే నేను స్టేషన్ కి వచ్చి
అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నా బైక్ తీసుకుని వెళ్తాను అంది ఆ అమ్మాయి.
కానిస్టేబుల్ ఏదో అనబోతుంటే సీ ఐ సైగ చేయడంతో వెళ్ళిపోయాడు కానిస్టేబుల్
ఆ అమ్మాయి బైక్ దగ్గరకు వచ్చి పర్స్ ఫోన్ ఇంటి కీస్ తీసుకుంటుంది
సీ ఐ వచ్చి నేను చెప్పేది ఒకసారి విను అన్నాడు
ఆ అమ్మాయి ఆటో అని వెళ్ళిపోయింది తుఫాన్లా
ఏం పిల్ల సార్ తిక్కది లా ఉంది అంత హెల్ప్ చేస్తే అలా మాట్లాడింది అన్నాడు కానిస్టేబుల్
ఏయ్ అని వింది అనుకో నీకు థర్డ్ డిగ్రీ చూపిస్తుంది ప్రాక్టికల్ గా అన్నాడు సీ ఐ
కానిస్టేబుల్ ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా సార్ అన్నాడు
హా అని కానిస్టేబుల్ తో ఏదో చెప్పి పంపించి తాను స్టేషన్ కి వెళ్ళాడు సీ ఐ
ఆ అమ్మాయి ఆటోలో కూర్చుని కళ్ళు తుడుచుకుంటుంది
ఆటో అతను ఏమ్మా పోలీసోళ్ళు బైక్ ఇవ్వను అన్నారా ఇంట్లో ఏమైనా అంటారు అనా అన్నాడు
లేదన్నా అని హాస్పిటల్ లో ఎలా ఉందో అని కంగారు గా ఉంది అంది ఆ అమ్మాయి
అంతా మంచే జరుగుతుంది అని ఆపాడు ఆటో
డబ్బులు ఇచ్చి దిగి లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి
హమ్మయ్య వచ్చేసావా ఎంత భయం వేసిందో అంది రజని
ఎలా ఉంది అక్కకి అంది ఆ అమ్మాయి.
ఓకే ఇంకో అరగంట అంది రజనీ.
ఆ అమ్మాయి వంక చూసి మళ్ళీ ఏమైంది నందనా అంది రజనీ.
ఆ అమ్మాయి పేరు నందన అన్నమాట
ఎందుకు అంతలా ఏడ్చావు హా ఎవరైనా ఏమైనాఅన్నారా
వాళ్ళతో బైక్ కోసం గొడవ పడ్డావా అని గుర్తు వచ్చారా అంది రజనీ లాలనగా
నందన రజనీని హగ్ చేసుకొని ఏడుస్తూ గుర్తురావడానికి మర్చిపోతే కదా అని నేను చూసాను అంది
ఎవరిని అంది రజనీ నందన వీపు మీద చేయివేసి నిమురుతూ
తననే అంది విసుగ్గా ఏడుస్తూ నందన.
తననే అంటే అని కృష్ణ ని చూసావా అంది రజనీ
ఊ అంది నందన.సరే ఎక్కడ చూసావ్ అంది రజనీ
తనే పోలీసాఫీసర్ ఇందాక అక్కడ ఉంది అందినందన
అంటే సీ ఐ పేరు కృష్ణ అన్నమాట.వయసు 29 30ఉంటాయేమో ఇంకా పెళ్ళి కాలేదు
చూడటానికి చాలా బాగుంటాడు ఒత్తైన జుట్టునిండైన మీసకట్టు క్లీన్ షేవ్ కళ్ళలో పొగరు
మాటలో పదును చేతిలో వాడి మనసులో మంచితనంకొంచెం తొందరపాటుతనం
స్టెబిలిటీ కలుపుగోలుతనం తన తోటి వాళ్ళతో క్రింద వాళ్ళతో మంచిగా ఉంటాడు.
ఇందాక ఫోన్ లో వివరాలు పంపించాను వెతకాలి అంటున్నది ఈ అమ్మాయి కోసమే అనుకుంటా చూద్దాం...
స్టేషన్ కి వెళ్ళి కూర్చునిఆలోచిస్తున్నాడు కృష్ణ
నందన రజనీ కానిస్టేబుల్ ని రిక్వెస్ట్ చేస్తుంటే మిర్రర్ లో చూసాడు
ఎంతో ఆనందం తన దగ్గరకు రావాలని దిగాడుకానీ తన కోపం గుర్తు వచ్చి ఆగి పోయాడు
తన కళ్ళలో కన్నీళ్ళు చూసి పక్కనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ని పిలిచి తనే కట్టాడు
నందన కోపం తో వెళ్ళాక కానిస్టేబుల్ తోతెప్పించి కూర్చున్నాడు తన క్యాబిన్ లో
అసలు ఏం మారలేదే నువ్వు అదే కోపం పంతం మొండితనం కానీ
నీ కళ్ళలో అనుకుంటుంటే ఎవరో రావడం తన పనిలో మునిగి పోయాడు.
ఇంకో గంట తర్వాత కానిస్టేబుల్ వచ్చి ఏదో పేపర్ ఇచ్చి వెళ్ళాడు
అక్కడ రజనీ అక్క గిరిజ కీ ఆడపిల్ల పుట్టింది
రజనీ కాఫీ తీసుకుని వస్తాను అనివెళ్ళింది
నందన పాపని తీసుకుని హాయ్ తల్లీ వచ్చేసావా భయం వేసిందా నాకు వేసింది
చాలా నావల్లే నువ్వు ఇబ్బంది పడిపోతావేమో అని చెబుతుంటే నర్స్ వచ్చి
ఇంకో వన్ హవర్లో రూంకి షిఫ్ట్ చేస్తారు మీరు రూంలో ఉండండి అని వెళ్ళింది లోపలికి.
మనం రూంలోకి పోదామా అని వెళ్ళింది నందన
రూం బాగుంది పేషెంట్ తో పాటు ఇంకో ఇద్దరు పడుకోవచ్చు అని
పాపని పడుకోబెట్టి సంతోషంతో ఏవేవో కబుర్లు చెబుతుంది నందన
రజనీకి నర్స్ చెప్పడంతో రూంకి వచ్చి పాపని ఎత్తుకుని ముద్ధు పెట్టి హడలు కొట్టావ్ కదే అంది.
పాప విషయం ముందు గిరిజ వాళ్ళ ఆయన ప్రసాద్ కి ఫోన్ చేసి చెప్పింది.
థాంక్యూ బయలుదేరతాను జాగ్రత్త అని తను ఎలా ఉంది అన్నాడు ప్రసాద్.
అక్క బాగుంది ఇంకో గంట తర్వాత వస్తుంది రూంకి అంది రజనీ.
నీతో ఎవరు ఉన్నారు అన్నాడు ప్రసాద్
నందన ఉంది అంది రజనీ.
నందన తీసుకుని కంగ్రాట్స్ బావగారు పార్టీఇవ్వాలి అంది.
తప్పకుండా మరదలు కోతి జాగ్రత్త అని కట్చేసాడు ప్రసాద్.
నందన మొహం చూసి మళ్ళీ కోతి అన్నారా అంది రజనీ.
ఊ అంది నందన.అందరికీ ఫోన్లు చేసిచెప్పింది రజనీ
ఇద్దరూ కూర్చుని కబుర్లుచెప్పుకుంటున్నారు
ఇంతలో గిరిజ ని తీసుకుని వచ్చారు.
నందన గబగబా గిరిజ చెవిలో దూది పెట్టితలకు కట్టింది.
రజనీ గిరిజ చేతులెత్తి దండం పెట్టారు.
చాలు చాలు నేను ఏమీ కానా మీకు అంది నందన.
ఇంతలో డోర్ దగ్గర ఎక్స్క్యూజ్ మీ అని వినబడింది
అందరూ తలలు తిప్పి చూసారు.పాపకి కావాల్సినవి గిరిజ కి కావాల్సినవి వచ్చాయి
ఎందుకే ఇవన్నీ అంది రజనీ.
నీకు కాదులే ఇంకా టైం ఉంది నీకు ఇప్పుడుమాత్రం ఇవన్నీ వీళ్ళకే అని పాపని ఎత్తుకుని
ఏరా తల్లీ ఇవన్నీ నీకు చాలా చాలా అవసరంకదా అంటూ కబుర్లు చెబుతుంది నందన
రజనీ పేరెంట్స్ ఊరు వెళ్ళారు రేపువస్తారు గిరిజ అత్తగారి వాళ్ళు రేపు వస్తారు
రాత్రి ఎనిమిది గంటలు ఏవో మెడిసిన్ కావాలంటే రజనీ వెళ్ళింది
చూద్దాం.......నందన కి కృష్ణ అంటే ఎందుకుకోపం?ఏం జరిగింది?