ఎపిసోడ్ – 3
అఖిరాకు అప్పటికీ ఈవెంట్ పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు.
“కనీసం ఏదైనా NGO నుంచైనా పిన్నీ ఆపరేషన్‌కి హెల్ప్ దొరకుతుందేమో…” అనే ఆలోచనతో, ఆన్‌లైన్‌లో NGOల లిస్ట్ చూస్తూ కాల్‌లు చేయడం ప్రారంభించింది.
కొన్ని కాల్స్ అవ్వలేదు… కొన్ని మాట్లాడి డిటైల్స్ అడిగి పెట్టేశారు.
అలా ఒక NGO కాల్ లిఫ్ట్ చేసింది.
అఖిరా వాళ్లతో తన గురించి, పిన్ని పరిస్థితి గురించి చెప్తూ, గుండెల్లో దాచుకున్న బాధను ఒకసారి బయటకు వెళ్లగొట్టింది.
పిన్నికి డాక్టర్స్ ‘Acute Cholecystitis’ అని చెప్పారు.
గాల్‌బ్లాడర్‌లో పెద్ద స్టోన్ ఇరుక్కుపోయి ఇన్‌ఫెక్షన్ వచ్చింది.
స్టోన్ బైల్‌డక్ట్‌ను కూడా బ్లాక్ చేయడంతో పసుపు, గట్టి నొప్పి, వాంతులు… ఏమీ తినలేని పరిస్థితి.
డాక్టర్లు వెంటనే రెండు ప్రొసీజర్లు చేయాలని చెప్పారు—
మొదట ERCP చేసి బ్లాక్ అయిన బైల్‌డక్ట్‌ను క్లియర్ చేయాలి.
తర్వాత Laparoscopic Cholecystectomy చేసి గాల్‌బ్లాడర్‌ను పూర్తిగా తొలగించాలి.
ఈ రెండు ప్రొసీజర్లు, ICU, మెడిసిన్స్, టెస్టులు అన్నీ కలిపి దాదాపు 4.5 lakhs అవుతాయని చెప్పారు,”**
అని అఖిరా చప్పున ముగించింది.
వాళ్లు అర్థం చేసుకున్నారు.
“ఇంకొన్ని రోజుల్లో ఫండ్ రిలీజ్ అవుతుంది. మీ అడ్రస్ డిటైల్స్ నోట్ చేసుకున్నాం. మేమే కాల్ చేస్తాము,” అని చెప్పి ఫోన్ పెట్టేశారు.
అఖిరాకు కాస్త ఊపిరి పోసుకున్నట్టు అనిపించింది.
---
రెండు రోజుల తర్వాత సత్య ఫోన్ చేసింది.
“అఖిరా, గుడ్ న్యూస్!
మన ఈవెంట్ ఎవరంటే… డైరెక్టర్ గారి రిలేటివ్, ఫేమస్ బిజినెస్‌మాన్ గోకుల్‌నంద గారి 25వ యానివర్సరీ!” అన్నది.
అఖిరా కళ్లలో ఆశ మెరిసింది.
“అంటే… కన్ఫర్మ్ అయ్యిందా?”
“అయ్యింది రా! ఇక మనం బాగా చేస్తే చాలు!”
అని సత్య ఉత్సాహంగా చెప్పింది.
---
⭐ 25th Anniversary Event
సాయంత్రం ప్రాంగణం రంగుల వెలుగుల్లో మెరిసింది.
సెటప్ అంతా చుట్టూ పెద్దమనుషులు, మీడియా, గెస్ట్‌ల రాకపోకలు…
సత్య–అఖిరా ఇద్దరూ అలసట మరిచి పరుగులు తీస్తూ,
“స్టార్టర్స్ వచ్చాయా?”
“లైట్ క్రాస్ అవుతున్నాయ్, కొంచెం ఎత్తు పెంచండి!”
“ఫ్లవర్ ఆర్చ్ కాస్త లూజ్‌గా ఉంది — ఫిక్స్ చేయండి!”
అని అన్నీ చెక్ చేస్తుంటే అఖిరా మనసు తడిసి ముద్దవుతోంది.
“అఖిరా… ఈ ఈవెంట్ బాగా అయిపోయిన వెంటనే డబ్బులు వస్తాయి.
పిన్నీ ఆపరేషన్ కూడా మొదలెట్టచ్చు,” అని సత్య కళ్లల్లో ఆశతో చెప్పింది.
“నిజం సత్య… ఇప్పుడు ఇది ఒక్కటే నాకు ఉన్న అవకాశం,”
అని అఖిరా నిశ్శబ్దంగా అంది.
---
ఈవెంట్ మొదలయ్యాక…
డెకరేషన్స్ చూసి గెస్ట్‌లు ప్రశంసలు కురిపించారు.
గోకుల్‌నంద గారే ముందుకువచ్చి—
“అరే, ఈ అరేంజ్‌మెంట్స్ ఎవరు చేసారు?” అని అడిగారు.
కిషోర్ వెంటనే అఖిరాని చూపించి,
“సర్… ఇవన్నీ అఖిరా చూసుకుంది,” అని పరిచయం చేశాడు.
“చాలా బాగా చేసారు అమ్మా. డీటైల్ అటెన్షన్ అద్భుతం,”
అని గోకుల్‌నంద గారు పొగిడారు.
ప్రతి ఒక్కరి ప్రశంసతో అఖిరా హృదయం కరిగిపోయింది.
ఎక్కడో తండ్రి తనను చూస్తున్నట్టూ అనిపించింది.
---
ఈవెంట్ మధ్యలో…
ఒక్కసారిగా చల్లగాలి వీచింది.
అఖిరా కొన్ని క్షణాలు ఆగిపోయింది.
మరోసారి…
అదే అదృశ్య ఉన్నికీ తన పక్కనే తిరిగినట్టుగా అనిపించింది.
గతంలో లాగా — శాంతమైన, మృదువైన, విపరీతంగా పరిచయం ఉన్న ఒక ఉనికి.
అఖిరా గుండె ఒక తపటం వేసింది.
“ఇది ఏమిటి…?” అని తాను తాను అడిగుకున్నా,
ఎవ్వరూ కనిపించలేదు.
తల ఆడుకుని మళ్లీ పనుల్లో మునిగిపోయింది.
---
ఈవెంట్ పూర్తయ్యాక సత్య పరిగెత్తుకుంటూ వచ్చింది.
“అఖిరా, గోకుల్‌నంద సర్ నిన్ను పిలుస్తున్నారు!
సైడ్ రూమ్‌లో ఉన్నారు… చెక్ ఇవ్వాలనుకుంటున్నారేమో!”
అఖిరా హృదయం దడదడలాడింది.
“సరే… వస్తాను,” అనింది.
---
గోకుల్‌నంద గారు చిరునవ్వుతో ఆమె వైపు తిరిగారు.
“బాగా చేసావమ్మా.
ఇదిగో… ఇది నీ చెక్.”
చెక్లో ₹5,00,000 అని ఉంది.
అఖిరా షాక్ అయ్యింది.
“సర్… ఐదు లక్షలా? అంతా…?”
అతను నవ్వుతూ,
“నీకెంత అవసరమో కిషోర్ చెప్పాడు.
పిన్నీకి కావాల్సిన ఆపరేషన్ మొత్తం, నీ జీతం కలిపి— ఇది నీ భాగం.
మిగతా టీమ్‌కు ఇచ్చేదాన్ని నేను కిషోర్‌కే ఇచ్చేశా. వాళ్లకు ఆయన పంపిస్తాడు,” అన్నాడు.
అఖిరా కళ్లల్లో నీళ్లు ఉప్పొంగాయి.
“థ్యాంక్యూ సర్… మీరు చేస్తున్న సహాయం నేను జీవితాంతం మర్చిపోలేను…”
“భవిష్యత్తులో ఏదైనా హెల్ప్ కావాలంటే బెరుకు పడకుండా అడుగు,”
అని ధైర్యం ఇచ్చాడు.
అఖిరా వంగి నమస్కరించి బయటకు వచ్చింది.
చెక్‌ని గుండెలకి హత్తుకున్నంత పనైంది.
---
ఆనందంతో నడుస్తూ వస్తుండగా…
అకస్మాత్తుగా ఎవరో బలంగా ఢీ కొట్టారు.
అఖిరా బ్యాలెన్స్ కోల్పోయి —
ఈవెంట్ స్విమ్మింగ్‌పూల్ అంచు దగ్గర జారి పడిపోబోతుండగా
ఆ వ్యక్తి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.
కాని ఆమె చేతిలో ఉన్న చెక్ మాత్రం నీళ్లలో పడిపోయింది.
“హే!
కళ్ళు కనపడలేదా?”
అని అఖిరా గట్టిగా అరిచింది.
అతను ఒక అడుగు ముందుకు వచ్చాడు.
బాగా తాగి ఉన్నాడు…
మాటల్లో అశాంతి…
ముఖంలో తీవ్రత.
అఖిరాని చూసిన క్షణంలోనే—
“I… love you.”
అని నిదానంగా, నిశ్శబ్దంగా అన్నాడు.
అఖిరా షాక్ అయి వెనక్కి తగ్గింది.
“ఏంటి? కళ్లూ మెట్టికెక్కినట్లుగా ఏం మాట్లాడుతున్నావ్!?
అసలు నువ్వెవరు?” ఆమె కోపంగా అరిచింది.
అతను ఒక్క మాట కూడా చెప్పకుండా… కాళ్లు తడబడుతున్న అఖిరా ముందుకు వచ్చి మళ్లీ అదే మూడు పదాలు గట్టిగా చెప్పాడు—
“I LOVE YOU.”
తర్వాత ఒక్కసారిగా తిరిగి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
అఖిరా పూర్తిగా అయోమయంలో నిలిచిపోయింది.
అది పరిచయం లేని ముఖం…
అయినా ఏదో వింతగా భయంకరమైన దగ్గరితనం.
కదులుతూ సత్య దగ్గరకు వెళ్లింది.
---
“ఏం అయ్యింది? చెక్ ఇచ్చారా?” అని సత్య అడిగింది.
అఖిరా తడబడి,
“ఇచ్చారు… కానీ…” అని అంటూఉండగానే.
“మరి చెక్ ఎక్కడ అఖిరా? ఖాళీ చేతులతో ఎలా వచ్చావ్?”
అని సత్య ఆశ్చర్యపోయింది.
అఖిరా జరిగినదంతా చెప్పేసరికి
సత్య కోపంతో లేచింది.
“అసలు అతను ఎవడు!?
కొంచం కూడా సెన్స్ లేదా?” అని తిట్టింది.
అఖిరా కూర్చుని తలని చేతులతో పట్టుకుంది.
“ఇప్పుడేం చేద్దాం సత్య…”
సత్య దీర్ఘశ్వాస తీసుకుని,
“దిగులు పడకు.
నేను కిషోర్‌తో మాట్లాడి ఆఫీస్ అడ్రస్ తీసుకుంటాను.
నీ చెక్‌కి రీప్లేస్‌మెంట్ తీసుకురావచ్చు.
రేపు ఉదయం ఆఫీస్‌కి వెళ్దాం,” అంది.
అఖిరా నిశ్శబ్దంగా తల ఊపింది.
ఇద్దరూ ఇంటి వైపు బయలుదేరారు…
కానీ అఖిరా మనసు మాత్రం ఆ ఘోరమైన ‘I LOVE YOU’ ప్రతిధ్వనిలోనే మిగిలిపోయింది.
---
ముందుకు కొనసాగుతుంది…